
జక్కల ఆదిశేషు కుటుంబానికి పరామర్శ
తనకల్లు: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, నల్లమాడ మాజీ జెడ్పీటీసీ జక్కల ఆదిశేషు కుటుంబాన్ని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరామర్శించారు. తనకల్లు మండలం బొంతలపల్లికి మంగళవారం చేరుకున్న ఆయన ఆదిశేషు భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు జక్కల జ్యోతి, కుటుంబ సభ్యులు బొడ్డు నాగరాజు, అరుణను ఓదార్చారు. అనంతరం ఆదిశేషు సమాధి వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ కదిరి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్, జిల్లా ఉపాధ్యక్షుడు బైక్ భాస్కరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, నాయకులు రామ్‌దేశాయ్, మాజీ ఎంపీటీసీ రాందాస్, చలపతి, రవి, స్టోర్ వెంకటరెడ్డి, గౌస్, మండల కమిటీ సభ్యులు కరే నరేంద్ర, బాబ్జాన్, సూరి, రెడ్డిశేఖర్‌రెడ్డి, తాహీర్, ఖాదర్‌వలి, సర్వేశ్వరరెడ్డి, సలీం, నారాయణరెడ్డి, యశ్వంత్‌రెడ్డి, రామమోహన్, మహేష్‌రెడ్డి, బాబు, నాగిరెడ్డి, గణేష్, హైదర్‌వలి, చాకివేలు రమణ, కిరణ్, నరసింహులు, నీలకంఠారెడ్డి, కిష్టప్ప, రామాంజి, కొండయ్య, నల్లచెరువు మండల నాయకులు విశ్వనాథ్‌రెడ్డి, దశరథనాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.