హిందూపురం టౌన్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది. దోమలు విపరీతంగా పెరగడంతో సీజనల్ వ్యాధులు విరుచుకుపడ్డాయి. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వారంతా చికిత్స కోసం హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. ఫలితంగా సోమవారం ఓపీ 1000 దాటిపోయింది. ఓపీ చీటీల కోసం జ్వరపీడితులంతా ఆస్పత్రి ఎదుట బారులు తీరారు. చిన్నారుల ఓపీ కూడా కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఓపీకి వచ్చే వారి సంఖ్య తగ్గలేదు. జ్వరపీడితులు భారీగా పెరగడంతో పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యం పొందడానికి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు.
వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బారులు తీరిన గర్భిణులు
రోగులతో కిక్కిరిసిన జిల్లా ఆస్పత్రి
‘సీజనల్’ బారులు
‘సీజనల్’ బారులు
‘సీజనల్’ బారులు