
వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్‌గ
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మేరకు కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించడంతో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పీవీ మిథున్ రెడ్డి అందుబాటులో లేరు. ఆయన అందుబాటులోకి వచ్చే వరకు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై
చర్యలు తీసుకోవాలి
● జిల్లా ఎంపీడీఓల సంఘం డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడుపై నోరు పారేసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎంపీడీఓల సంఘం, డిప్యూటీ ఎంపీడీఓల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల అనంతపురం జెడ్పీ కార్యాలయానికి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి తన స్థాయి మరచి డీపీఓ నాగరాజునాయుడిని దుర్భాషలాడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జేసీ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు కలెక్టరేట్‌కు విచ్చేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీడీటీఓలు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీ రాజ్ శాఖ కీలకంగా పని చేస్తుందన్నారు. అంతటి కీలకమైన శాఖకు జిల్లా అధికారిగా ఉన్న నాగరాజునాయుడిని జేసీ ప్రభాకర్‌రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమన్వయం అవసరమన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అత్యంత దురుసుగా వ్యవహరించిన తీరు, వాడిన పరుష పదజాలంతో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ చేతన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్‌గ