
జెడ్పీ ఉద్యోగి ఆకస్మిక మృతి
అనంతపురం సిటీ: స్థానిక హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న జెడ్పీ ఉద్యోగి శివనారాయణరెడ్డి(56) సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోలుకోలేక తుదిశ్వాస వదిలినట్లు వివరించారు. మొన్నటి వరకు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో టైపిస్ట్‌గా పని చేసిన శివనారాయణరెడ్డి.. ఇటీవల బదిలీపై పెనుకొండలోని ఆర్‌డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న జెడ్పీ ఉద్యోగులు పలువురు ఇంటికి వెళ్లి శివనారాయణరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు సంతాపం తెలిపారు.