గుప్త నిధుల తవ్వకాల కలకలం | - | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల తవ్వకాల కలకలం

Oct 5 2023 12:24 AM | Updated on Oct 5 2023 11:58 AM

పేలుబండ కొండ సమీపంలో తవ్విన గుంత  - Sakshi

పేలుబండ కొండ సమీపంలో తవ్విన గుంత

అమరాపురం: మండలంలోని పేలుబండ గ్రామ సమీపంలోని లక్ష్మీ రంగనాథస్వామి కొండ వద్ద మళ్లీ గుప్త నిధుల తవ్వకాల కలకలం రేగింది. కొండ కింద భాగాన ఉన్న మరువ సమీపంలో మంగళవారం రాత్రి జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతుండడగా గ్రామస్తులు గుర్తించారు.జేసీబీని ఆపి, పోలీసులకు సమాచారం అందించారు. గతంలో కూడా ఇక్కడ తవ్వకాలు జరిపారని గ్రామస్తులు తెలిపారు. పోలీసు అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కాంతరాజు, మంజునాథ్‌, ఆలదపల్లి మూర్తి తదితరులపై కేసు నమోదు చేసినట్లు గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement