ఎంసీఏ సీటు వచ్చినా.. స్థోమత లేకపోవడంతో చావే కరెక్ట్‌ అని! | - | Sakshi
Sakshi News home page

ఎంసీఏ సీటు వచ్చినా.. స్థోమత లేకపోవడంతో చావే కరెక్ట్‌ అని!

Aug 21 2023 1:38 AM | Updated on Aug 21 2023 1:49 PM

- - Sakshi

రామాంజిన రెడ్డి కుమార్తె భూమిక (20) హైదరాబాద్‌లోని కళాశాలలో ఏంసీఏ సీటు వచ్చింది. అయితే అక్కడికెళ్లి చదువుకునేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మనస్తాపం చెందిన

రొద్దం/ధర్మవరం అర్బన్‌: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులిద్దరూ 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన మేరకు...

► రొద్దం మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన రామాంజిన రెడ్డి కుమార్తె భూమిక (20) హైదరాబాద్‌లోని కళాశాలలో ఏంసీఏ సీటు వచ్చింది. అయితే అక్కడికెళ్లి చదువుకునేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం రాత్రి ఇంట్లోనే పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని కుటుంబసభ్యులు గుర్తించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. కాగా, భూమిక మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకరనారాయణ పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటంబసభ్యులను ఓదార్చారు.

► మరో ఘటనలో ధర్మవరంలోని మారుతీ నగర్‌కు చెందిన మహబూబ్‌పీరా రెండో కుమార్తె నస్రీన్‌ (19) అనారోగ్య పరిస్థితిని తాళలేక ఆదివారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌పీరాకు ముగ్గురు కుమార్తెలు కాగా, ఎలక్ట్రీషియన్‌ పనులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండో కుమార్తె నస్రీన్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులకు తల్లిదండ్రులు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ధర్మవరం టూ టౌన్‌ పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement