చిన్న వయసు, విష్ణుప్రియ డాక్టర్‌ ఆశలకు 'ఉరి' | shivamogga subbaiah medical college Student Ends Life | Sakshi
Sakshi News home page

చిన్న వయసు, విష్ణుప్రియ డాక్టర్‌ ఆశలకు 'ఉరి'

Jun 3 2025 8:39 AM | Updated on Jun 3 2025 10:04 AM

shivamogga subbaiah medical college Student Ends Life

శివమొగ్గ(కర్ణాటక): శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్‌ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్‌లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది. 

మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్‌ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది.  కారణాలు తెలిసి రాలేదు. డెత్‌నోట్‌ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు  ఆమె శవాన్ని  ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement