పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ పాల్గొన్నారు.
పోలీసులే అన్యాయం చేస్తున్నారు
టీడీపీ నేతల మాటలు విని కేసు నమోదు చేయకుండా పోలీసులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఎస్పీ ఎదుట నల్లమాడ మండలం సానేవారిపల్లి గ్రామానికి చెందిన మంజుల, వరలక్ష్మి వాపోయారు. ఈ మేరకు సోమవారం వారు ఎస్సీ సతీష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... సానేవారిపల్లికి గ్రామంలో గత నెల 30న గణే ష్ నిమజ్జనమం జరిగిందని, ఆ సమయంలో ఆంజనేయులు, మంజుల, వరలక్ష్మి కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకోవడంతో ట్రాక్టర్‌లో ఉన్న చెన్నకేశవులపై ఆంనేయులు, ఆయన కుమారులు రాజేష్, సాయితో పాటు వారి బంధువులు దాడి చేశారన్నారు. అంతటితో ఆగకుండా సాయంత్రం వరలక్ష్మి, మంజుల ఇంటిపై కొడవళ్లు, రాళ్లతో దాడి చేశారని వివరించారు. దాడికి పాల్పడిన వారు టీడీపీ నేతలు కావడంతో ఘటనపై కేసు నమోదు చేసేందుకు నల్లమాడ పోలీసులు వెనకడుగు వేస్తున్నారన్నారు. పైగా టీడీపీ నేతల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని అక్రమంగా తమపై కేసులు నమోదు చేసి, రోజూ స్టేషన్‌కు రావాలంటూ వేధిస్తున్నారని వాపోయారు. దీనిపై తమకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నట్లు బాధితులు వివరించారు.
అర్జీలు స్వీకరిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్
ఎస్పీకి అందజేసిన వినతిని చూపుతున్న బాధితులు మంజుల, వరలక్ష్మి
పరిష్కార వేదికకు 60 వినతులు