
వాస్తవాలు రాస్తున్నారనే ‘సాక్షి’పై అక్రమ కేసులు
తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న ‘సాక్షి’ పత్రికపై కూటమి ప్రభుత్వం అక్కసు వెల్లగక్కుతోంది. ప్రతిపక్ష నేతలను, ప్రజల పక్షాన మాట్లాడే ‘సాక్షి’ని నోరు మూయించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేకపోయినా ఏదో అద్భుతాలు జరుగుతున్నట్లు ఎల్లో మీడియాలో చూపిస్తున్నారు. కానీ ‘సాక్షి’లో వాస్తవాలు రాస్తున్నందున చంద్రబాబు బండారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసిపోతోంది. అందుకే ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తన తప్పులను సరిచేసుకోకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. అక్రమ కేసులు, అరెస్టులు ‘సాక్షి’ని ఏమీ చేయలేవు.
– మహమ్మద్ షాకీర్, మాజీ మంత్రి, కదిరి

వాస్తవాలు రాస్తున్నారనే ‘సాక్షి’పై అక్రమ కేసులు