భర్త ఉండగా ఆమెకు ఇద్దరు ప్రియులు... మొదటి ప్రియుడు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

భర్త ఉండగా ఆమెకు ఇద్దరు ప్రియులు... మొదటి ప్రియుడు ఆత్మహత్య

Published Mon, Nov 6 2023 12:44 AM

- - Sakshi

శ్రీ సత్యసాయి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు బెల్ట్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లి గ్రామానికి చెందిన శివ(25), చిలమత్తూరు మండలం కోడూరు థామస్‌మన్రో తోపు సమీపంలో ఉన్న ఓ గార్మెంట్స్‌ పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే పరిశ్రమలో పనిచేస్తున్న ఓ వివాహితతో సన్నిహితంగా మెలిగేవాడు.

అయితే ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేక శనివారం రాత్రి చిలమత్తూరు మండలం మొరంపల్లి సమీపంలో విషపూరిత ద్రావకం తాగాడు. అనంతరం తన ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రంతా గాలించినా శివ ఆచూకీని పసిగట్టలేకపోయారు.

ఆదివారం ఉదయం చెట్టుకు బెల్టుతో ఉరి వేసుకుని విగత జీవిగా వేలాడుతున్న శివను మొరంపల్లి వాసులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ కుమారుడి మృతికి పరిశ్రమలో పనిచేస్తున్న వివాహితతో పాటు మరో వ్యక్తి కారణమంటూ శివ తండ్రి శ్రీరామప్ప చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement