ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

● స్థానిక ఎన్నికల్లో

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని.. ప్రజల విశ్వాసాన్ని కూటమి ప్రభుత్వం కోల్పోయిందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో 14 పంచాయతీలకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశాన్ని మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పూజితతో కలిసి కాకాణి శనివారం నిర్వహించారు. పంచాయతీల వారీగా ప్రత్యేకంగా సమావేశమై స్థానిక ఎన్నికలపై దిశా నిర్దేశం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు రావాలంటే స్థానిక ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ధైర్యంగా పోరాడి విజయం సాధించాలని కోరారు. అవసరమైతే తాను ఎంతదూరమైనా వస్తానని.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.

కరువు జిల్లాగా ప్రకటించాలి

నెల్లూరును కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తనకున్న టెక్నాలజీతో ఆకాశం నుంచి జిల్లాను పరిశీలించి పచ్చగా ఉందంటూ కరువు జిల్లాల నుంచి మినహాయించారని విమర్శించారు. ప్రకటించకపోతే ఉద్యమాన్ని తమ పార్టీ చేయనుందని ప్రకటించారు. వర్షపాతాన్ని బట్టి కరువు మండలాలను ప్రకటిస్తారని.. అయితే చంద్రబాబు అశాసీ్త్రయంగా నిర్ధారించారని దుయ్యబట్టారు. తొలి పంటను పండించుకునేందుకు నీళ్లెక్కడా లేవని, జిల్లాలో ఎండలు మండిపోతున్నాయని తెలిపారు. కరువు చంద్రబాబుతోనే వచ్చిందని, ఆయన ఎప్పుడు గద్దెనెక్కినా ఇది విలయతాండ వం చేస్తుందని గుర్తుచేశారు. మదనపల్లెలో నిర్వహించి న సభలో అబద్ధాలనే వల్లెవేశారని మండిపడ్డారు.

ఆత్మ పరిశీలన ఎవరు చేసుకోవాలి..?

పొదలకూరు మండల పర్యటనకు వచ్చినప్పుడల్లా నీతి వ్యాఖ్యాలను సోమిరెడ్డి వల్లిస్తుంటారని పేర్కొన్నారు. ఆత్మ పరిశీలనను ఎవరు చేసుకోవాలో ప్రజలు చెప్పుకొంటున్నారని తెలిపారు. లేఅవుట్ల యజమానుల వద్ద డబ్బులు దండుకున్నందుకా లేక గ్రావెల్‌, ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్నందుకా ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రశ్నించారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా, ముందుకు రావడంలేదన్నారు. గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, నేతలు కోనం చినబ్రహ్మయ్య, వూకోటి లక్ష్మీనారాయణ, లక్ష్మీకల్యాణి, రావుల ఇంద్రసేన్‌గౌడ్‌, అంజద్‌, వేణుగోపాల్‌రెడ్డి, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement