కల్తీ పాలు తయారీపై దాడులు | - | Sakshi
Sakshi News home page

కల్తీ పాలు తయారీపై దాడులు

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

● రెండు క్యాన్ల పాలు పారబోత

వెంకటాచలం: పాలల్లో ప్యాట్‌ శాతం పెరిగేందుకు వంట నూనె కలిపి కల్తీ పాలను తయారు చేసి డెయిరీలకు సరఫరా చేస్తున్న కేంద్రంపై ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు శనివారం దాడులు చేశారు. మండలంలోని తిక్కవరప్పాడుకు చెందిన పంబా యేసుదాసు రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాడు. తన ఇంట్లో మరికొంచెం కల్తీ పాలను తయారు చేసి డెయిరీకి సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జి.వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. యేసుదాసు నివాసంలోని ఓ గదిలో ఉన్న రెండు క్యాన్లలోని పాలను తనిఖీ చేయగా ఫ్రీడం సన్‌ ప్లవర్‌ ఆయిల్‌తో కల్తీ పాలను తయారు చేసినట్లు గుర్తించారు. కల్తీ చేసిన పాలలో ప్యాట్‌ కంటెంట్‌ తనిఖీ చేయగా 8 శాతం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో రెండు కాన్లలోని కల్తీ పాలను ధ్వంసం చేశారు. అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాలను సేకరించే డెయిరీ యజమాన్యం కూడా నిత్యం పాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. తాము డెయిరీల్లో కూడా తనిఖీ చేస్తామని, కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే వాటిని కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ కల్తీ పాలలో నుంచి శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటిఫైడ్‌ ల్యాబొరేటరీకి పంపి, కల్తీ పాలు తయారు చేసిన పంబా యేసుదాసుపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట ఫుడ్‌ సేప్టీ అధికారిణి ఎం.ప్రణతి, వీఆర్వో సుమలత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement