రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని శుక్రవారం కర్ణాటక హైకోర్టు జడ్జి సుమలత, కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ బదిలీ
నెల్లూరు సిటీ: నెల్లూరు ఏసీబీ డీఎస్పీ పి.రామకృష్ణుడిని కడప ఎస్‌డీపీఓగా బదిలీ చేస్తూ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న టి.వెంకటేశులును ఆత్మకూరు డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా ఎవరిని నియమించలేదు.


