రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి

Oct 1 2026 12:11 AM | Updated on Oct 1 2026 12:11 AM

నెల్లూరు(బృందావనం): వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. రాపిడో కెప్టెన్లకు రోడ్డు భద్రతపై పురమందిరంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను తగ్గించేందుకు డ్రైవర్‌తోపాటు ప్రయాణికుడు హెల్మెట్‌ ధరించాలని అధికారులు సూచించారు. రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంపై కలిగే ప్రమాదాలపై అవగాహన కలిగించారు. ప్రమాద సమయంలో గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడే ‘రహవీర్‌’ కార్యక్రమం గురించి వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి గోల్డెన్‌ అవర్‌లో వైద్యసహాయం అందేలా చూడడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చన్నారు. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు బాలమురళీకృష్ణ, మమహ్మద్‌ రఫీ, కార్తీక్‌ పవన్‌కుమార్‌, ఏఎంవీఐలు స్వప్నీల్‌ రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య, రాపిడో సంస్థ జోనల్‌ హెడ్‌ శ్రీనివాస్‌, నెల్లూరు సిటీ మేనేజర్‌ దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement