పెన్షనర్ల హక్కులను కాలరాసేందుకు కుట్రలు | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల హక్కులను కాలరాసేందుకు కుట్రలు

Sep 29 2026 11:58 PM | Updated on Sep 29 2026 11:58 PM

● మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

● కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా

నెల్లూరు(బృందావనం): పెన్షనర్లు, సీనియర్‌ సిటిజన్ల హక్కులు, ప్రయోజనాలను కాలరాసే చట్టాలు అమలు కాకుండా ఉండేందుకు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎం.గౌస్‌, ఎస్పీవీఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ, ఫ్యామిలీ పెన్షనర్లు, సీనియర్‌ సిటిజన్స్‌ న్యాయమైన హక్కులు,ప్రయోజనాల పరిరక్షణ కోసం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పెన్షన్‌ వాలిడేషన్‌ చట్టం పెన్షనర్స్‌కు శరాఘాతం వంటిదన్నారు. అందుకు భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు తప్పవన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత పి.బాబురెడ్డి కూటమి ప్రభుత్వాల వైఖరిని తూర్పాబట్టారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రమణయ్య పెన్షనర్లు, సీనియర్‌ సిటిజన్ల న్యాయమైన 12 డిమాండ్లను వివరించారు. ఎస్‌ఎం గౌస్‌ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో న్యాయమైన హక్కుల సాధనకోసం సంఘటితంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం అసోసియేషన్‌ నేతలు వినతిపత్రాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. అసోసియేట్‌ అధ్యక్షులు ఎన్‌.శ్రీనాథ్‌, ఫయాజ్‌ అహ్మద్‌, ఉపాధ్యక్షుడు గురునాథరావు, కోశాధికారి జె.హజరత్తయ్య, జిల్లాలోని వివిధ మండలాలు, తాలూకాలకు చెందిన నేతలు రవికుమార్‌, వసుంధరాదేవి, ఎ.శ్రీరాములు, కోటేశ్వరరావు, బి.సుధాకర్‌, ఎస్‌.మాల్యాద్రి, ఎం.మస్తానయ్య, కె.సుబ్బారావు, డి.గోపాల్‌ తదితరులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement