నేటి పీజీఆర్‌ఎస్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి పీజీఆర్‌ఎస్‌ రద్దు

Sep 27 2026 11:54 PM | Updated on Sep 27 2026 11:54 PM

నెల్లూరు రూరల్‌: నగరంలోని కలెక్టరేట్లో ఈ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు.

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో పోలీస్‌ శాఖ నిమగ్నమైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు గమనించాలని కోరారు.

నీటి సమస్యను

పరిష్కరించకపోతే పోరాటాలు

ఉదయగిరి: వెలిగొండ ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ పనులను పూర్తి చేసి మెట్ట ప్రాంత ప్రజల సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే పోరాటాలను చేపట్టనున్నామని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కాకు వెంకటయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండో దశ నిర్మాణాలకు రూ.వెయ్యి కోట్లను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వరికుంటపాడు మండలంలోని రామాపురం వద్ద మంగళవారం నిర్వహించనున్న బహిరంగ సభలో ఈ విషయమై సీఎం చంద్రబాబు ప్రకటన చేసేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ పనులు పూర్తయితే బీడు భూములు సాగులోకి వచ్చి వలసలు తగ్గుతాయన్నారు. పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ కంపెనీలకు ప్రభుత్వాలు ధారాదత్తం చేయడం దారుణమని చెప్పారు. నేతలు వెంగయ్య, రాజగోపాల్‌, జనార్దన్‌, ప్రసాద్‌, బయన్న, హరినారాయణ, వెంకటేశ్వర్లు, దస్తగిరి అహ్మద్‌, కోడె రమణయ్య, నాయబ్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి ఎస్జీఎఫ్‌

జిల్లా స్థాయి ఎంపికలు

నెల్లూరు (టౌన్‌): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా స్థాయి ఎంపికలను సోమవారం నుంచి నిర్వహించనున్నామని ఎస్జీఎఫ్‌ జిల్లా సెక్రటరీ మల్లికార్జునరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

● 28న వుషు (అండర్‌ – 17, 19), బాక్సింగ్‌, తైక్వాండో, చెస్‌, ఘట్కా, టెన్నిస్‌

(అండర్‌ – 14, 17, 19), క్రికెట్‌ (అండర్‌ – 14, 19) బాలబాలికల ఎంపికలను ఏసీ స్టేడియంలో నిర్వహించనున్నామని వివరించారు. హ్యాండ్‌బాల్‌ (అండర్‌ – 14, 17, 19) పోటీలను పొదలకూరులోని డీఎన్నార్‌ స్కూల్లో జరపనున్నామని చెప్పారు.

● 29న జూడో, టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ (అండర్‌ – 14, 17, 19).. వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌ (అండర్‌ – 14, 17), క్రికెట్‌ (అండర్‌ – 17) ఎంపికలను ఏసీ స్టేడియంలో నిర్వహించనున్నామన్నారు. రగ్బీ (అండర్‌ – 14, 17, 19) ఎంపికలను పొదలకూరులోని డీఎన్నార్‌ స్కూల్లో జరపనున్నామని పేర్కొన్నారు.

● అక్టోబర్‌ మూడున అథ్లెటిక్స్‌ (అండర్‌ – 17), ఫుట్‌బాల్‌ (అండర్‌ – 14, 17).. ఐదున ఫుట్‌బాల్‌ (అండర్‌ – 19) సెలక్షన్స్‌ను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నామని ప్రకటించారు.

ఉద్యోగుల

సమస్యలపై చర్చ

ఒంగోలు సిటీ: ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జోన్‌ – 3 సర్వసభ్య సమావేశాన్ని ఒంగోలులోని ఏబీఎం జూనియర్‌ కళాశాలలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల సభ్యులతో ఆదివారం నిర్వహించారు. ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై సభ్యుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. ఉద్యోగోన్నతుల ప్రక్రియను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పారదర్శకంగా నిర్వహించినందుకు గానూ ఆర్జేడీ పద్మకు కృతజ్ఞతలను తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement