డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

నెల్లూరురూరల్‌: డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బోడి లింగాలపాడు జయకుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన, వైఎస్సార్‌ టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్‌కుమార్‌ మాట్లాడారు. దీనిని ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విజయవాడలో నిరసన సందర్భంగా నిరుద్యోగులు, వైఎస్సార్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలన్నారు. గాయపడిన వారికి నష్టపరిహారం అందించాలని కోరారు. క్రీడా కోటా, డీఎస్సీ నియామకాలపై నిష్పాక్షిక విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని, ఆర్టీసీ, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నవీన్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement