విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు

Sep 16 2026 11:56 PM | Updated on Sep 16 2026 11:56 PM

ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి

నెల్లూరు(టౌన్‌): పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని మెడికల్‌ కాలేజీ సెమినార్‌ హాల్లో నెల్లూరు డివిజన్‌లోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యలో అమలవుతున్న విద్యా శక్తి, క్లిక్కర్స్‌, పాల్‌ ల్యాబ్‌, మధ్యాహ్న భోజన పథకం, కర్మ యోగి, నషాముక్త విద్యాలయ, టీచ్‌ టూల్‌ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభ్యసనా ఫలితాలు బాగుంటేనే పాఠశాలలకు భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. ఏ విద్యార్థి వరుసగా అయినా మూడురోజులు పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలను నిబంధనల ప్రకారం జరపాలన్నారు. లీప్‌ యాప్‌ను 100 శాతం మంది డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వ్యవహరించాలన్నారు. మిషన్‌ మార్చ్‌ 2026ను పది విద్యార్థులకు షెడ్యూల్‌ ప్రకారం అమలు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వరనాయక్‌, సెక్టోరియల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement