● నిర్వహణకు రాజాల అనుమతి
వెంకటగిరి(సైదాపురం): ప్రిసిద్ధి చెందిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరను సంప్రదాయాలను అనుసరిస్తూ వైభవంగా నిర్వహించాలని వెంకటగిరి రాజా కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర సూచించారు. స్థానిక రాజా ప్యాలెస్‌లో వెంకటగిరి గ్రూప్ దేవస్థాన ఈఓ శ్రీనివాసులురెడ్డికి, సీఐ రోశయ్యకు బుధవారం సంప్రదాయబద్ధంగా సాయికృష్ణ యాచేంద్ర తాంబులాలు అందించి జాతర నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సంప్రదాయలను గౌరవిస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో దేవదాయ, పోలీసు, పలు శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతం చేయాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.


