● తుది గెజిట్ విడుదల
● 54 నుంచి 72కు పెంచుతూ
నోటిఫికేషన్
● ఖరారైన సరిహద్దులు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ) డివిజన్ల పునర్వి భజనకు ఆమోదముద్ర పడింది. ఈ మేరకు తుది గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న 54 డివిజన్లను 72కు పెంచుతూ తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పునర్విభజనపై ప్రిలిమినరీ నోటిఫికేషన్‌కు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి సరిహద్దులను ఖరారు చేసింది. ఆయా డివిజన్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలు, సరిహద్దులకు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపరిచారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కోసం ఈ ఏడాది మేలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 72కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ జీఓ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు పార్టీ నేతలు, మరి కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వినిపించే వాదనల కోసం అవకాశం కల్పించింది. త్వరలోనే వాదనలు పూర్తయి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ బుధవారం ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.


