వైన్‌ షాపుల లైసెన్స్‌లు ఏడాది పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

వైన్‌ షాపుల లైసెన్స్‌లు ఏడాది పునరుద్ధరణ

Sep 13 2026 12:24 AM | Updated on Sep 13 2026 12:24 AM

జిల్లాలో 198 దుకాణాలకు

నోటిఫికేషన్‌ విడుదల

21 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ

22న లైసెన్స్‌ల జారీ

నెల్లూరు(క్రైమ్‌): ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్‌ కాలపరిమితి ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీటి లైసెన్స్‌లను మరో ఏడాది కాలపరిమితితో పునరుద్ధరిస్తూ నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఓపెన్‌ కేటగిరీ కింద 183.. గీత కులాలకు రిజర్వ్‌ చేసిన దుకాణాలు 15 ఉన్నాయి. జల్లా గెజిట్‌ నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణను ఎకై ్సజ్‌ అధికారులు ప్రారంభించారు. దర ఖాస్తులను ఆన్‌లైన్లో ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు వరకు స్వీకరించనున్నారు. పునరుద్ధరణ మంజూరు ప్రక్రియను 22న పూర్తి చేసి లైసెన్స్‌లను జారీ చేయనున్నామని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి శ్రీనివాసులునాయుడు తెలిపారు.

జిల్లాలో ఇలా..

● జిల్లాలో 198 దుకాణాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఓపెన్‌ కేటగిరీలో నెల్లూరు నగరపాలక సంస్థలో 30, రూరల్‌ మండలంలో మూడు.. వెంకటాచలంలో ఆరు, మనుబోలులో మూడు, కావలి మున్సిపాల్టీలో ఆరు, రూరల్‌లో నాలుగు, జలదంకిలో రెండు, బోగోలులో మూడు, అల్లూరు నగర పంచాయతీలో నాలుగు, రూరల్‌లో రెండు, కోవూరులో ఆరు, కొడవలూరులో ఐదు, విడవలూరులో నాలుగు, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో ఆరు, రూరల్‌లో మూడు, దగదర్తిలో రెండు, సంగం, ఉదయగిరిలో మూడు చొప్పున, దుత్తలూరులో రెండు, మర్రిపాడులో నాలుగు, సీతారామపురంలో రెండు, వింజమూరులో మూడు, కలిగిరి, వరికుంటపాడులో రెండు చొప్పున, కొండాపురంలో మూడు, ఇందుకూరుపేటలో నాలుగు, తోటపల్లిగూడూరులో ఐదు, ముత్తుకూరులో ఎనిమిది, ఆత్మకూరు మున్సిపాల్టీలో నాలుగు, రూరల్‌లో ఒకటి, అనుసముద్రంపేట, కలువాయి, అనంతసాగరంలో రెండు చొప్పున, పొదలకూరులో ఆరు, చేజర్లలో మూడు, రాపూరు, సైదాపురంలో నాలుగు చొప్పున, గూడూరు మున్సిపాల్టీలో పది, రూరల్‌లో రెండు, చిల్లకూరులో ఆరు, కోట మండలంలో ఏడు దుకాణాలున్నాయి.

● గీత కులాలకు సంబంధించి నెల్లూరు నగరపాలక సంస్థ, కావలి మున్సిపాల్టీ, రూరల్‌ మండలం, జలదంకి, దగదర్తి, సంగం, దుత్తలూరు, వింజమూరు, కలిగిరి, ఆత్మకూరు, రూరల్‌, అనుమసముద్రంపేట, కలువాయి, అనంతసాగరం, గూడూరులో ఒకటి చొప్పున 15 షాపులున్నాయి.

జనాభా ఆధారంగా లైసెన్స్‌ ఫీజు

మద్యం దుకాణాలకు జనాభాను బట్టి వార్షిక రుసుమును నిర్ణయించారు. ఓపెన్‌ కేటగిరీ దుకాణాలకు సంబంధించి 50 వేల జనాభా వరకు రూ.60.5 లక్షలు.. 50 వేల నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.71.5 లక్షలు.. ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.93.5 లక్షలు.. గీత కులాలకు సంబంధించిన వాటికి రూ.30.3 లక్షలు, రూ.35.8 లక్షలు, రూ.46.8 లక్షలుగా ఖరారు చేశారు. దీనికి అదనంగా పర్మిట్‌ రూమ్‌, ఇతర నిర్దేశిత రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక లైసెన్స్‌ ఫీజును ఒకేసారి లేదా నాలుగు సమాన వాయిదాల్లో.. పర్మిట్‌ రూమ్‌ ఫీజును ఒకేసారి లేదా మూడు సమాన వాయిదాల్లో చెల్లించొచ్చని తెలిపారు. నూతన మద్యం పాలసీని పరిశీలించి నిర్ణీత గడువులోపు దరఖాస్తులను సమర్పించాలని శ్రీనివాసులునాయుడు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement