తన భార్య చింతం రత్నమ్మ పేరుతో ఉన్న వ్యవసాయ భూమిని తమకు తెలియకుండానే ఇతరుల పేర్లపై వన్‌బీ, అడంగళ్‌లో నమోదు చేశారని చింతం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. బ్రాహ్మణ క్రాక పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 2367, 2367/1/2లో ఉన్న 4.50 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోందని తెలిపారు. తమకు తెలియకుండా వేలమూరి అరుణకుమారి, మద్ది రెడ్డి రమాదేవి, మద్ది రెడ్డి వెంకటకృష్ణారెడ్డి పేర్లను రికార్డుల్లో నమోదు చేశారని, ఈ వ్యవహారంలో కొందరు టీడీపీ నాయకులు, సంబంధిత తహసీల్దార్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. భూ వివాదం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, ఎలాంటి అనుమతులు లేకుండా భూమిలో అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయానికి పెడుతున్నారన్నారు. సమస్య పరిష్కారం కోసం ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, గ్రీవెన్స్ కార్యక్రమానికి తాజాగా ఐదోసారి వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


