పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయనున్నామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. పటిష్టమైన ప్రణాళికతో దిశ, నిర్దేశం చేసుకొని ముందుకెళ్లడమే సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు, విధానాలు, అభిప్రాయాలను పార్టీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టంగా తెలియజేశామని పేర్కొన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జగనన్న ఇచ్చిన ధైర్యంతో పోరాడి 2019లో అధికారంలోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. సమావేశానికి భారీగా తరలిరావడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనే ఽధైర్యం లేక పోలీసులను అడ్డుపెట్టుకొని ఆటంకాలను సృష్టించేందుకు టీడీపీ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో మౌలిక వసతులు, సంక్షేమం కుంటుపడిందని, రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. రౌడీషీ ట్లు తెరవడం, అక్రమ కేసులు, నోటీసులతో వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి జగనన్నకు కానుకగా ఇద్దామన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి కేసుపై విచారణ జరిపించి, బాధ్యు లపై చట్టపరమైన చర్యలను చేపడతామని స్పష్టం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, జెడ్పీ చైర్‌పర్సన్ అరుణమ్మను సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే, కావలి ఇన్‌చార్జి రామి రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు యల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


