స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా రాజీపడొద్దని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం మరింత గట్టిగా పోరాడతామని చెప్పారు. టీడీపీ నేతల్లో అభద్రతాభావం కనిపిస్తోందని విమర్శించారు. పోలీసులను ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారన్నారు. మన ధైర్యమే విజయతీరాలకు చేరుస్తుందని చెప్పారు. కష్టపడి పనిచేసి ఎన్నికల్లో విజయం సాధిస్తే మరింత గుర్తింపొస్తుందని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంను చేద్దామని పిలుపునిచ్చారు.


