నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కలిసేందుకు నిత్యం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వస్తుంటారు. అయితే జైలు పరిసరాల్లో బారికేడ్ల మధ్య ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు వేలాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సందర్శకులు రాకపోకలు సాగించే ప్రాంతంలోనే ఇలా వైర్లు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేయాల్సి ఉంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


