ఐసీడీఎస్‌ పీడీ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌ పీడీ బాధ్యతల స్వీకరణ

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

నెల్లూరు(పొగతోట): సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాగశైలజను నెల్లూరు ఐసీడీఎస్‌ పీడీగా బదిలీ కాగా ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీడీపీఓలు పీడీని మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో పీడీగా పనిచేసిన హేనాసుజన్‌ను రాష్ట్ర అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆమె కాలంలో సొంత కారును అద్దెకు పెట్టారు. కార్యాలయంలోని చాంబర్‌లో ఏసీని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. సస్పెండ్‌ చేయడంతో వాహనాన్ని, ఏసీని తీసుకెళ్లారు. వాహనం సొంతదైనా ప్రభుత్వం ప్రతినెలా అద్దె చెల్లిస్తోంది. కొత్త పీడీ సమావేశానికి హాజరయ్యేందుకు వాహనం అందుబాటులో లేదు. సొంత కారులో వెళ్లారు.

పాముకాటుకు

వృద్ధురాలి బలి

చీకట్లో మరుగుదొడ్డికి వెళ్తుండగా ఘటన

వరికుంటపాడు: మండలంలోని తోటలచెరువుపల్లె పంచాయతీ కొండ్రాజుపల్లెలో పాముకాటుకు గురై మద్దినేని రత్తమ్మ (68) అనే వృద్ధురాలు మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు.. బుధవారం రాత్రి గ్రామంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో చీకట్లో ఆమె మరుగుదొడ్డికి వెళ్తుండగా పాముకాటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె భర్త ఏడాది క్రితం మృతిచెందాడు.

తరచూ విద్యుత్‌ అంతరాయాలు

గ్రామంలో రాత్రివేళల్లో తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేక చీకట్లో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇప్పటికై నా విద్యుత్‌ అంతరాయాలను తొలగించి నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలని కోరారు.

28న జిల్లా స్థాయి పోటీలు

నెల్లూరు(టౌన్‌): ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడులోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో వచ్చేనెల 28న జిల్లా స్థాయి రోల్‌ ప్లే, ఫోక్‌ డ్యాన్స్‌ పోటీలు జరుగుతాయని డీఈఓ ఆర్‌.బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నోడల్‌ అధికారిగా డైట్‌ సీనియర్‌ సైన్స్‌ ఉపన్యాసకురాలు వి.రాధారాణి వ్యవహరిస్తారన్నారు. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. వీటిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 9వ తరగతి చదవుతున్న వారు పాల్గొంటారన్నారు. 23న పాఠశాల స్థాయి, 26న మండల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రథమ స్థానంలో నిలిచిన వారు జిల్లా స్థాయిలో పాల్గొంటారన్నారు. ఇక్కడ ప్రథమ స్థానంలో వచ్చిన వారు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారన్నారు. రోల్‌ ప్లేలో ఆరోగ్యంగా పెరగడం, భావోద్వేగ సంక్షేమం, మానసిక ఆరోగ్యం, విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం, జెండర్‌ సమానత్వం, పోషణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఆరోగ్యకర జీవనశైలి, హెచ్‌ఐవీ నివారణ, హింస, గాయాల నుంచి భద్రత, రక్షణ తదితర అంశాలు ఉంటాయన్నారు. వీటిల్లో ఏదో ఒక ధీమ్‌లో పాల్గొనాలన్నారు. ఫోక్‌ డ్యాన్స్‌లో 11 అంశాలతోపాటు అదనంగా పర్యావరణ పరిరక్షణ అంశం ఉంటుందన్నారు. వివరాలకు 90100 85001 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

పొదలకూరు

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.225

సన్నవి : రూ.150

పండ్లు : రూ.80

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement