● పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
● అలరించిన ఫకీరుల విన్యాసాలు
అనుమసముద్రంపేట: మండల కేంద్రంలో ఉన్న హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ దొరసానమ్మల వార్షిక ఉరుసు గంధ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం నిర్వహించిన తహలీల్ ఫాతెహా ఉత్సవంతో ముగిశాయి. వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక మహాల్ నుంచి దర్గా పీఠాధిపతి హఫీజ్ పాషా ఆధ్వర్యంలో గంధాన్ని కలశంలో కలిపి, ముస్లిం పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫకీరుల డప్పు వాయిద్యాలు, గాయకుల కీర్తనల నడుమ గంధాన్ని హజరత్ వారి దర్గాకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రత్యేక వేదికపై హజరత్ వారి జపమాలను నాయబ్ సజ్జాదా జునైద్ పాషా భక్తులకు చూపించారు. అనంతరం తహలీల్ ఫాతెహా కార్యక్రమం నిర్వహించారు. గాయకులు నదీమ్ సందానీ తదితరులు ఆలపించిన హజరత్ వారి కీర్తనలు భక్తులను అలరించాయి. ఫకీరులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
తగ్గిన భక్తుల సంఖ్య
ఈ ఏడాది గంధోత్సవాలకు గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య తగ్గింది. ఉత్సవాలపై ముందస్తు ప్రచారం లేకపోవడంతోపాటు వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు కూడా భక్తుల రాక తగ్గడానికి కారణమయ్యాయని పేర్కొంటున్నారు.
హాజరైన భక్తులు
తహలీల్ ఫాతెహా నిర్వహిస్తూ..


