నైతిక విలువలను బోధించాలి | - | Sakshi
Sakshi News home page

నైతిక విలువలను బోధించాలి

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

వెంకటాచలం: దేఽశంలో సాంస్కృతిక, నైతిక విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరముందని, నైతిక విలువలపై తరగతులను పాఠశాల విద్య నుంచే తప్పనిసరి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విధానాల ఆధారంగా విమర్శలుండాలే గానీ.. వ్యక్తులు, కుటుంబాలపై బురదజల్లే వ్యక్తిగత దూషణలు ఉండకూడదని పేర్కొన్నారు. సభలు, చట్టసభల్లో గౌరవప్రదమైన చర్చలు సాగాలని, నిరసనలకు హద్దులుండాలని, అభ్యంతరకర దూషణలు చేసే ధోరణి మారాలని సూచించారు. సమాజంలో విద్వేషాలు, వ్యక్తిగత దూషణలు, హింసను ప్రేరేపించే రీతిలో సోషల్‌ మీడియా దుర్వినియోగం కావడం సరైన విధానం కాదన్నారు. వివిధ దేశాల్లో అమలు చేస్తున్న తరహాలోనే ఇక్కడా 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా అకౌంట్లు ఉండకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్‌ భారత్‌ – 2047 లక్ష్యం చేరాలంటే పల్లెలు, ఆకలి, అసమానతలు, అన్యాయం లేని రామరాజ్యంలా వికసించాలని కాంక్షించారు. మేనేజింగ్‌ ట్రస్టీ దీపావెంకట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement