నెల్లూరు(టౌన్): ది స్టన్నింగ్ మారుతి న్యూ బాలెనో కారును నెల్లూరు అయ్యప్పగుడి సమీపంలోని భార్గవి ఆటోమొబైల్స్ నెక్సా షోరూమ్‌లో బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ దాస్యం శ్రీనివాస్, భార్గవి ఆటోమొబైల్ చైర్మన్ కొండా బలరామిరెడ్డి, మారుతి సుజుకి టీఎస్‌ఎం సందీప్, మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్‌రెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు. పెట్రోల్‌కు సంబంధించి మైలేజీ మాన్యువల్ 23.08, ఏజీఎస్ ట్రాన్స్‌మిషన్ 24.77 కిలోమీటర్లు వస్తుందన్నారు. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎస్ – సీఎన్‌జీ మైలేజీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 33.61, సీఎన్‌జీ ఏజీఎస్ ట్రాన్స్‌మిషన్ 34.47 కి.మీ వస్తుందన్నారు. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, యాక్టింగ్ కూలింగ్‌తో వైర్‌లెస్ చార్జర్, హెడ్ అప్ డిస్‌ప్లే 360 డిగ్రీల వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్లు ఉన్నాయన్నారు. కారు ప్రారంభ ధర రూ.6.09,900లు ఉందన్నారు. ఇది ఏడు రంగుల్లో లభ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో భార్గవి ఆటోమొబైల్ సిబ్బంది పాల్గొన్నారు.


