నదిలో కలుస్తున్న మురుగునీరు
చెత్త కాల్చడంతో వెలువడుతున్న పొగ
జిల్లాకు పెన్నా నదితో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రజల అవసరాలకు ఆ జలాలే ఆధారం. అలాంటి నది ఒడిలో ఇప్పుడు జంతువుల
కళేబరాలు, చెత్తాచెదారం, కలుషిత మురుగునీరు చేరుతోంది. తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు, ఏటి పండగ పెన్నమ్మ చెంతనే జరుగుతాయి. అలాంటి చోట గోవధ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త కూడా పెద్దఎత్తున పోగవుతోంది. అయినా అధికార ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


