– రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ
ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత చంద్రశేఖరరెడ్డి కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలి. నియమ నిబద్ధతతో విద్యాసంస్థలు నడుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి కళాశాలల్లో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించడం రాజకీయ విద్వేషంగా భావిస్తున్నాం. అలవికాని హామీలిచ్చారు. అమలు చేయలేక.. ప్రజా వ్యతిరేకతను అణచివేసేందుకు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్ట్‌లతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. లేకుంటే బాధ్యత వహించి రాజీనామా చేయాలి.


