● ప్రజాదరణను ఓర్వలేకనే దాడులు
● కక్ష సాధింపు చర్యలను దీటుగా
ఎదుర్కొంటాం
● రాజకీయంగా ఎదుర్కోలేకనే
అడ్డదారులు తొక్కుతున్న కూటమి నేతలు
● కృష్ణచైతన్య విద్యాసంస్థల్లో అర్ధరాత్రి
తనిఖీలను ముక్తఖంఠంతో ఖండించిన ఎమ్మెల్సీలు
● కదం తొక్కిన పార్టీ శ్రేణులు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల వెన్నుపోటు, మోసాలు, అసమర్థ పాలన, మెగా డీఎస్సీ పేరుతో సాగించిన కుంభకోణంపై ప్రశ్నించడమే నేరమన్నట్లుగా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేయడాన్ని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులతో కలిసి నెల్లూరులో కదం తొక్కారు. డీఎస్సీ కుంభకోణంపై సాక్ష్యాధారాలతో ప్రశ్నించిన ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థలపై ఇంటర్‌బోర్డు అధికారులు తనిఖీలు చేయడం, అనుమతుల పేరుతో వేధింపులకు దిగిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలు 18 మంది సర్కారు దమననీతిపై దండయాత్ర చేశారు. సోమవారం చిల్డ్రన్స్‌పార్కు రోడ్డులోని రాంజీనగర్‌లోని చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ర్యాలీగా వీఆర్సీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శనగా కొనసాగారు. నల్లకండువాలు ధరించి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఫ్లకార్డులు, బ్యానర్లు చేతబూని ప్రభుత్వ దుర్నీతిని, దమన కాండలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలతో నిరసనను వ్యక్తం చేశారు.ఽ ఈ క్రమంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, కేఆర్‌జే భరత్, శివరామిరెడ్డి, ఈసాక్‌బాషా, ఆర్ రమేష్‌యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరిగ మురళీధర్, ఎన్. రామారావు, ఎం హనుమంతరావు, ఎండీ రూహుల్లా, డాక్టర్ ఎం.అరుణకుమార్, కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, మేకపాటి రాజారెడ్డి, నాయకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, మందల శేషయ్య, ఆశ్రిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


