డీఎస్సీపై ప్రశ్నించినందుకే దాడులు | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై ప్రశ్నించినందుకే దాడులు

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని చంద్రశేఖర్‌రెడ్డి ఆధారాలతో ప్రశ్నిస్తున్నందుకే కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మేము తప్పు చేస్తాం. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఇబ్బందులకు గురిచేస్తాం.. భయపెడతాం.. వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తాం అనే ధోరణితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌ బెదిరింపులకు ఎవరూ భయపడేవాళ్లు లేరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, రాబోవు ఎన్నికల్లో మీకు బుద్ధి చెబుతారు. ఇది కేవలం చంద్రశేఖర్‌రెడ్డికి సంబంధించిన విద్యాసంస్థల సమస్య మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన విషయం. కూటమి నాయకులను ప్రశ్నించారని, రాజకీయ కక్షలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. కాలేజీలను నిజంగానే సంస్కరించాలి అనుకుంటే, ముందు నారాయణ విద్యాసంస్థలను సంస్కరించేందుకు చర్యలు చేపట్టాలి. కృష్ణచైతన్య కాలేజీల్లో ఎలాంటి తప్పులూ లేవు. చంద్రశేఖర్‌రెడ్డిని ఎదుర్కొనలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారు.

– కాకాణి పూజిత, రాష్ట్ర మహిళా

విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement