కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై కక్ష సాధింపు

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

కూటమి ప్రభుత్వా న్ని ప్రశ్నించిన వారి పై, దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం పరిపాటిగా మారింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి వంటి సౌమ్యుడిని సైతం రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొనలేక తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌ అడ్డదారులు తొక్కడం సిగ్గు చేటు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలను, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారీ మరింత దిగజారి ప్రవర్తించడం తండ్రీకొడులకు అలవాటుగా మారింది. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కృష్ణచైతన్య విద్యాసంస్థలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గం. నేను జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఉన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. ఎంతో మంది అనాథ పిల్లలకు, ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు చంద్రశేఖర్‌రెడ్డి కృష్ణచైతన్య విద్యాసంస్థలు ఉచితంగా విద్యను అందించి అండగా నిలిచింది. ఇది కేవలం ఒక సంస్థపై జరిగిన దాడి కాదు. ప్రశ్నించే గొంతులపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, వైఎస్సార్‌సీపీపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం.

– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement