నారాయణ విద్యాసంస్థలపై దాడులు చేసే ధైర్యం ఉందా | - | Sakshi
Sakshi News home page

నారాయణ విద్యాసంస్థలపై దాడులు చేసే ధైర్యం ఉందా

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొ నే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేశ్‌లకు లేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడడం దుర్మార్గం. డీఎస్పీ అక్రమాలను ప్రశ్నించిన తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో తనిఖీలు, ఆకస్మిక దాడులు చేస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి విద్యాసంస్థలపై జరిగిన దాడులను తమ పార్టీపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేపడితే తాము కూడా ఇదే ఒరవడి, సంప్రదాయం కొనసాగిస్తే కూటమి నాయకులు తట్టుకోలేరు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు చిత్తశుద్ధి ఉంటే వందల సంఖ్యలో ఉన్న నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలపై దాడులు చేసే ధైర్యం చేయాలి. అక్రమంగా నిర్వహిస్తున్న హాస్టళ్లపై తనిఖీలు ఎందుకు జరపడం లేదు. ప్రశ్నించిన వారిపై అకమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు.

– లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement