– వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ
డీఎస్సీలో అక్రమాలు, అవినీతి జరగకుంటే వెంటనే
సీబీఐతో విచారణ జరిపించాలి. ఆ డీఎస్సీలో జరిగిన కుంభకోణాలను వెల్లడించారనే తమ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దుర్మార్గం. నెల్లూరు నగరంలో 70 జూనియర్ కళాశాలలుంటే కేవలం చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన జూనియర్ కళాశాలలపై దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై గళం విప్పుతున్న వారి వ్యక్తిగత వ్యాపారాలు, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.


