తప్పుల మీద తప్పులు చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

తప్పుల మీద తప్పులు చేస్తున్నారు

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

– కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ

కూటమి ప్రభుత్వం ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు తప్పుపై తప్పులు చేస్తుంది. 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసింది. డీఎస్సీ అవినీతి, అక్రమాలపై సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తున్న తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి భయాందోళనలకు గురి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడే వారెవరూ మా పార్టీలో లేరు. రాష్ట్రంలో ప్రతి రంగంలో అవినీతి పెరిగిపోయింది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బాబు ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement