యోగా పోస్టర్‌ విజేతలకు బహుమతుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

యోగా పోస్టర్‌ విజేతలకు బహుమతుల ప్రదానం

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

నెల్లూరు(టౌన్‌): జిల్లా స్థాయి యోగా పోస్టర్‌ పోటీల్లో విజేతలకు సోమవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు. డీఈఓ బాలాజీరావు చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కావలి పాతూరు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి బున్సి సుదేశ్‌ ప్రథమ బహుమతి, మనుబోలు మండలం వీరంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన అలకానంద ద్వితీయ స్థానాన్ని, ఇందుకూరుపేట ఎంకేఆర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి వాహిద్‌ తృతీయ స్థానాన్ని సాధించారు. విజేతలకు వరుసగా రూ.1000, రూ.750, రూ.500 నగదు బహుమతులతోపాటు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు, యోగ్యతా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అనధికార మద్యం విక్రయాలపై దాడులు

36 కేసుల నమోదు

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి

శ్రీనివాసులు నాయుడు

నెల్లూరు(క్రైమ్‌): ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా వారం రోజులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి ఎ.శ్రీనివాసులు నాయుడు తెలిపారు. తనిఖీల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తున్న 36 మందిని అరెస్ట్‌ చేసి 280 క్వార్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 67 మందిని అరెస్ట్‌చేశామని చెప్పారు. బహిరంగ మద్యసేవనాన్ని కట్టడి చేసేందుకు రూపొందించిన పోస్టర్లను జిల్లాలోని ప్రధాన కూడళ్లు, మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు, మాదకద్రవ్యాలపై ఇతర శాఖల సమన్వయంతో కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునామన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనధికార మద్యం విక్రయాలు, అక్రమ నిల్వలు, ఇతర ఎకై ్సజ్‌ నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప ఎకై ్సజ్‌ అధికారులకు లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ 14405కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

యువకుడి ఆత్మహత్య

నెల్లూరు(క్రైమ్‌): ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జనశక్తినగర్‌కు చెందిన అఖిల్‌ కుమార్‌ (27), ప ర్వీన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అఖిల్‌ ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను ఓ మహిళతో మాట్లాడుతున్నాడని దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈనెల 17వ తేదీన పర్వీన్‌ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అఖిల్‌ ఆదివారం సాయంత్రం భార్యకు ఫోన్‌ చేశాడు. వారిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అఖిల్‌ తన బెడ్‌రూమ్‌లో సీలింగ్‌కు ఉన్న ఇనుప పైపునకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement