● వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి
● రాష్ట్రంలో అధిక ధరలపై తీవ్ర విమర్శలు
కోట: సామాన్య ప్రజలకు గుదిబండలా మారిన పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని విద్యానగర్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబుకు సామాన్యుల కష్టాలు తెలియవని మండిపడ్డారు. మహానాడు రద్దు చేశామని చెప్పుకోవడం కాకుండా, పెరుగుతున్న ధరలతో ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని సూచించారు. పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అదనపు పన్నులను తగ్గించాలన్నారు. రైతులు, ఆటో కార్మికులు, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపశమనం కలిగేలా పెరిగిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు.


