కండలేరులో 41.150 టీఎంసీలు | - | Sakshi
Sakshi News home page

కండలేరులో 41.150 టీఎంసీలు

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 41.150 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,050, లోలెవల్‌ కాలువకు 50, హైలెవల్‌ కాలువకు 80, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్‌ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

గ్రంథాలయాలకు పోటీ పరీక్షల పుస్తకాలు

గ్రంథాలయ సంస్థ

చైర్‌పర్సన్‌ శాంతకుమారి

కొడవలూరు: పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులోకి తెస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ మేకపాటి శాంతకుమారి తెలిపారు. మండలంలోని యల్లాయపాళెం గ్రంథాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. అందుబాటులో ఉన్న పుస్తకాలు, వేసవి విజ్ఞాన శిబిరం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అన్ని రకాల పుస్తకాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను విజ్ఞాన శిబిరానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్‌ జె.సురేంద్రరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement