పెట్రో పాపం బాబుదే | - | Sakshi
Sakshi News home page

పెట్రో పాపం బాబుదే

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

రాష్ట్రంలో పెట్రో మంటకు అధికారంలో చంద్రబాబునే కారణం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ట్యాక్స్‌లు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధికి కేవలం ఒక్క రూపాయి సెస్‌ రూపంలో పెంచింది. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్‌ పెట్రోల్‌ ధరలపై పక్క రాష్ట్రాలతో పోల్చి దుష్ప్రచారం చేశారు. లోకేశ్‌ అయితే పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడి పెట్రోల్‌ బంకుల వద్ద సెల్ఫీలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అబద్ధాలు వల్లించారు. తాము అధికారంలోకి వస్తే మిగతా రాష్ట్రాలతో సమానంగా ధరలను తగ్గిస్తామంటూ ఆర్భాటంగా హామీలు ఇచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. రెండేళ్లు అయినా తగ్గించకపోగా, తాజాగా పెరిగిన ధరలపై నోరు మెదపకపోవడం దారుణం. ఎన్నికల హామీ మేరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటాలను ఉధృతం చేస్తోందంటూ వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. సర్కారు మెడలు వంచి తీరుతామన్నారు. నెల్లూరు సిటీలో సమన్వయకర్త, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రిక్షాలు తొక్కుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. వెంకటాచలంలో కాకాణి, ఉదయగిరిలో సమన్వయర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఎడ్ల బండిని తోలుతూ నిరసనలో పాల్గొన్నారు. కావలిలో పార్టీ శ్రేణులు ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

– సాక్షి నెట్‌వర్క్‌

ఎన్నికల ముందు ట్యాక్స్‌లు తగ్గిస్తామని హామీలు

పక్క రాష్ట్రం పెట్రోల్‌ బంకుల దగ్గర సెల్ఫీలతో దుష్ప్రచారం

అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా తగ్గించని కూటమి సర్కారు

తాజాగా పెంచిన ధరలపై నోరుమెదపని తండ్రీకొడుకులు

పెంచిన పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు

తగ్గించేంత వరకు పోరాటాలు ఆగవు

చంద్రబాబు పొదుపు మంత్రం పేద ప్రజలకేనా?

Advertisement
 
Advertisement
Advertisement