ఆత్మకూరు: పట్టణంలోని ఎల్‌ఆర్‌పల్లి, టెక్కే, తూర్పువీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లో రికార్డులను మంగళవారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (ఉర్దూ) షేక్ ఖాజా మొహిద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. కష్టపడి చదవాలని సూచించారు. ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో బోధించాలన్నారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఈనెల 31 వరకు జీఎఫ్‌ఎల్‌ఎన్, లైన్ అసిస్‌మెంట్ సర్వే ఉంటుందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట హెచ్‌ఎం రియాజ్, పలు పాఠశాలల టీచర్లున్నారు.


