పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అజిత మంగళవారం నగరంలోని చిన్నబజారు, నవాబుపేట పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సాంకేతికత ఆధారంగా సైబర్ నేరాలను ఛేదించడంతోపాటు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో చిన్నబజారు, నవాబుపేట ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


