తల్లీకుమారుడిపై కత్తితో దాడి
● భూ వివాదం నేపథ్యంలో
సమీప బంధువు ఘాతుకం
జలదంకి (కలిగిరి): భూవివాదం నేపథ్యంలో తల్లీకుమారుడిపై సమీప బంధువు కత్తితో దాడికి పాల్పడిన ఘటన మండలంలోని కమ్మవారిపాళెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్, అతని అన్న కుమారుడు హరిబాబుకు మధ్య ఎకరా పొలానికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. గ్రామస్తులు, పెద్ద మనుషుల సూచనల మేరకు చెరో అర ఎకరా భూమిని సాగు చేసుకుంటున్నారు. కాగా హరిబాబు తన పొలాలను వేరే వారికి కౌలుకు ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో రమేష్ పొలం నాదని.. మా అమ్మ, నాన్నలను చూసుకున్న వారికి పొలం దక్కుతుందని, ఇతరులకు ఇవ్వడానికి అంగీకరించనని వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో రమేష్ పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి మేకల కోసం ఆకులను కోసే కత్తితో హరిబాబుపై దాడి చేయగా తలకు రక్త గాయాలయ్యాయి. అడ్డుకోవడానికి వచ్చిన హరిబాబు తల్లి హైమావతిపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితులను చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచా రణ జరుపుతున్నారు.
తల్లీకుమారుడిపై కత్తితో దాడి


