వినియోగదారులకు అవగాహన కల్పించాలి
నెల్లూరు రూరల్: వర్షాలు, వాతావరణ మార్పులతో అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో నీరు పెట్రోల్‌తో కలిసింది. దీంతో అందులోని ఇథనాల్ వేరు పడి తెలుపు రంగుగా మారుతోంది. దానిని వాహనంలో నింపిన తర్వాత అవి మరమ్మతులకు గురవుతున్నాయి. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పించాలి’ అని జిల్లా పెట్రోల్ బంక్ యూనియన్ అధ్యక్షుడు అల్లారెడ్డి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అండర్ గ్రౌండ్ పైపులైన్ జాయింట్ల ద్వారా కూడా పెట్రోల్, డీజిల్ ట్యాంక్‌ల్లో నీరు చేరడాన్ని కొన్నిచోట్ల గుర్తించామన్నారు. ఇలా జరగకుండా యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్పులతో వచ్చిన సమస్యలపై అవగాహన కోసం ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వం పోస్టర్లు, హోర్డింగులను ప్రతి బంక్‌లో ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో యూనియన్ జనరల్ సెక్రటరీ పి.రవికుమార్, రాజశేఖరరెడ్డి, పీటీ జగన్నాథం, పి.జితేంద్రబాబు, కె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.


