జిల్లాలోనే కొనసాగించాలంటూ..
సైదాపురం, రాపూరు, కలువాయి, గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని పీడీఎస్‌యూ నాయకులు అన్నారు. ఈ మేరకు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రాపూరు మండలంలో కండలేరు జలాశయం ఉందని, దీని కింద వేలాది మంది రైతులు భూములు సాగు చేసుకుంటున్నారన్నారు. సైదాపురం మండలంలో మైకాలో వేలమంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. సైదాపురం నుంచి నెల్లూరుకు 50 కిలోమీటర్లు మాత్రమే ఉందని, తిరుపతికి వెళ్లాలంటే 130 కిలోమీటర్లు దూరంతో ఇబ్బందులు పడుతారన్నారు. గూడూరులోని విద్యార్థులు యూనివర్సిటీకి వెళ్లాలంటే చాలా దూరం అవుతుందన్నారు.


