అనుమానం పెనుభూతమై..
● భార్య గొంతు కోసిన భర్త
ఉదయగిరి: ఓ వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె గొంతు కోసి హత్యాయత్నం చేసిన ఘటన ఉదయగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి, బాధితురాలి కథనం మేరకు.. ఉదయగిరి పట్టణంలోని రజక వీధికి చెందిన చీపినాపి గురవయ్య స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. అతను భార్య రమణమ్మపై అనుమానం పెంచుకున్నారు. కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. గురవయ్య కత్తితో రమణమ్మ గొంతు కోశాడు. అయితే కత్తి పూర్తిగా గొంతులోకి వెళ్లకపోవడంతో రక్త గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు బాధితురాలకు చికిత్స చేసి ప్రాణాపాయం లేదని తెలిపారు. ఎస్సై కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.
అక్రమ లేఅవుట్లపై చర్యలు
కలువాయి(సైదాపురం): మండలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై చర్యలు తప్పవని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆదివారం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను గుర్తించాలని, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకునేలా చూడాలని తహసీల్దార్ కృష్ణారెడ్డి, అధికారులకు తెలియజేశారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.20
సన్నవి : రూ.16
పండ్లు : రూ.10


