రహదారి గుంతకు మరమ్మతులు
ఆత్మకూరు: ఆత్మకూరు నుంచి చేజర్లకు వెళ్లే మార్గంలో వెంకయ్య స్వామి గుడి సమీపంలో రహదారిపై భారీ వాహనాల తాకిడితో వారం రోజుల క్రితం పారుదల కాలువ బ్రిడ్జికి రంధ్రం పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ మార్గంలో పెద్ద వాహనాలను నిలిపివేశారు. విద్యార్థులు, రైతులు పడుతున్న ఇక్కట్లను, భారీ ఇసుక వాహనాల రవాణాతో ధ్వంసం అవుతున్న రోడ్ల గురించి ‘ఇసుక మాఫియాకు రోడ్లు బలి’ శీర్షికతో ఆదివారం సాక్షిలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన రహదారులు, భవనాల శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. నూతన పైపులైన్లను జేసీబీ యంత్రాల సహాయంతో ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి వాహనాలు యథావిధిగా తిరగొచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు.
రహదారి గుంతకు మరమ్మతులు


