భగవద్గీత శ్లోక పోటీలకు విశేష స్పందన
నెల్లూరు(బృందావనం): నగరంలోని పురమందిరంలో సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు దగ్గుపాటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన భగవద్గీత శ్లోక పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఈ పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులు శ్రావ్యంగా ఆలపించిన శ్లోకాలు భక్తిభావాన్ని ప్రేరేపించాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకంగా జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, నగదు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, పల్మనాలజిస్ట్ డాక్టర్ డి.మధుసూదన్, సామాజిక సేవకులు పెనాక సుజితరెడ్డి, ఆడిటర్లు జేవీ చలపతిరావు, ఎం.బాలకృష్ణ, ఏజే గుప్తా, సతీష్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత విశిష్టతను వివరించారు.


