పుష్పాలంకరణలో రంగడి దర్శనం | - | Sakshi
Sakshi News home page

పుష్పాలంకరణలో రంగడి దర్శనం

Dec 26 2025 8:36 AM | Updated on Dec 26 2025 8:36 AM

పుష్పాలంకరణలో రంగడి దర్శనం

పుష్పాలంకరణలో రంగడి దర్శనం

నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం రంగనాథ స్వామి విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఉభయదేవేరులతో కొలువైన స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డాక్టర్‌ ఎం.ప్రసన్నగుప్తా, దుర్గావరం వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement